డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: మహిళ అరెస్ట్‌

- November 03, 2018 , by Maagulf
డ్రగ్స్‌ స్మగ్లింగ్‌: మహిళ అరెస్ట్‌

బహ్రెయిన్: నార్కోటిక్‌ పిల్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న కేసులో బహ్రెయినీ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇరాన్‌ నుంచి మొత్తం 2,990 పిల్స్‌ని నిందితురాలు స్మగుల్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 35 ఏళ్ళ ఈ మహిళ, బహ్రెయిన్‌లో వాటిని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానాస్పదంగా కన్పించిన ఆమెను కస్టమ్స్‌ అధికారులు తీసుకుని, తనిఖీలు నిర్వహించగా, బ్యాగులో దాచిన నార్కోటిక్‌ పిల్స్‌ బయటపడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com