'సారీ బాబాయ్..' తేల్చి చెప్పిన హీరో కళ్యాణ్ రామ్!
- November 04, 2018
నందమూరి కుటుంబానికి రాజకీయాలతో ఉన్న బంధం గురించి ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ టీడీపీ పార్టీ తరఫున హిందూపురంఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయంలో నందమూరిహీరోలు టీడీపీ పార్టీ సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసిన సందర్భాలు చాలానేఉన్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా గతం టీడీపీ మహానాడు సభలకుపలుసార్లు హాజరయ్యారు. గత కొద్దిరోజులుగా కళ్యాణ్ రామ్ టీడీపీ తరఫునవచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఏరియా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడనేవార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయంపై కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణతోమాట్లాడి తనకు రాజకీయాల పట్ల ఎలాంటి ఆసక్తి లేదని చెప్పేశాడట.'సారీ బాబాయ్, నేను ఇప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేను. ప్రస్తుతంనా మైండ్ లో సినిమా తప్ప మరొక ఆలోచన లేదు. వచ్చే పదేళ్లలోసినిమాల్లోనే ఉండాలనుకుంటున్నాను' అని క్లారిటీ ఇచ్చేశాడట.
విషయంతెలుసుకున్న చంద్రబాబు.. కళ్యాణ్ రామ్ తో రహస్యంగా మీటింగ్ పెట్టిమాట్లాడాలని బాలకృష్ణకి చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చే ఎలెక్షన్స్ లోకళ్యాణ్ రామ్ ను పోటీ చేయించే విధంగా చంద్రబాబు పావులు కదిపేఛాన్స్ ఉందని అంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి