ఇండియాలో అరెస్ట్ అయిన ఒమనీయులు స్వదేశానికి..
- November 04, 2018
మస్కట్: చిన్న వయసు బాలికల్ని పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు ఒమనీయులు ఎట్టకేలకు స్వదేశానికి వెళ్ళేందుకు మార్గం సుగమం అయ్యింది. చాలా రోజులుగా హైద్రాబాద్‌లోనే చిక్కుకపోయిన తమవారు, స్వదేశానికి వస్తున్నందున వారి కోసం భారీ స్వాగత ఏర్పాట్లు చేశామని ఐదుగురు ఒమనీయుల కుటుంబాలకు చెందినవారు అంటున్నారు. ఏడాదికి పైగా ఈ ఐదుగురు ఒమనీయుల్ని హైద్రాబాద్‌లో నిలువరించడం జరిగింది. హసన్ అల్ కాసిమి, హబీబ్ అల్ మహాహీ, తలిబ్ అల్ సాల్హి, జుమా అల్ ఒబైదని, నాజర్ అల్ సాల్హి అరెస్టయిన ఐదుగురు వ్యక్తులు. గత సెప్టెంబర్‌లో వీరిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమను తాము మెడికల్ టూరిస్టులుగా అరెస్టయిన వ్యక్తులు పేర్కొనడం జరిగింది. అక్టోబర్‌లో, వీరిని నిర్దోషులుగా భారత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతకుముందు జూన్‌లో ఒమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డెలిగేషన్, ఈ ఐదుగురు ఒమనీయులకు న్యాయసహాయం అందించేందుకు ఇండియా చేరుకుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







