వెంకీ ఇంట మ్రోగనున్న పెళ్లి బాజా
- November 05, 2018
సీనియర్ హీరోలైన నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి పిల్లలకి దాదాపుగా వివాహాలు అయ్యాయి. చిరు ముగ్గురు పిల్లలకి ఎప్పుడో పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాలయ్య ఇద్దరు కూతుళ్లకి పెళ్లి అయ్యి కొడుకు మోక్షజ్ఞ మాత్రమే పెళ్లికి ఉన్నాడు. మోక్షజ్ఞ ఇంకా చిన్నోడే. ఇక నాగార్జున కూడా నాగ చైతన్యకి పెళ్లి చేశాడు. ఇక సీనియర్ హీరోస్ లో వెంకటేష్ తన పిల్లల పెళ్లిళ్లు చెయ్యాల్సి ఉంది. అయితే మొన్నీమధ్యనే వెంకటేష్ కూతురు ఆశ్రిత పెళ్లి జరగబోతున్నట్టుగా వార్తలొచ్చాయి. ఆశ్రిత ఎవరినో ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ హైలెట్ అయ్యింది.
అయితే ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డి మనవడితో జరగనున్నదట. సురెందర్ రెడ్డి మనవడు వెంకీ కూతురు ఆశ్రిత మంచి ఫ్రెండ్స్. తర్వాత ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడడంతో ఇటు వెంకీ ఫ్యామిలీ అటు సురెందర్ రెడ్డి ఫ్యామిలీ ఈ పెళ్లి విషయమై మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రావడం. ఇరు పెద్దలు కలిసి పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడం జరిగిందని చెబుతున్నారు. కార్తీక మాసం అంటే నవంబర్ 24న వెంకటేష్ కూతురు ఆశ్రిత వివాహం జరగనుందట.
అయితే పెళ్లికి కేవలం 20 రోజులు మాత్రమే ఉండడంతో. ఇరు కుటుంబాల వారు ఆశ్రిత పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారని తెలుస్తుంది. పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి