యూఏఈలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
- November 07, 2018
యూఏఈ అంతటా దీపావళి పండుగ సందర్భంగా వెలుగులు విరజిమ్మాయి. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దీపావళి వేడుకల కోసం రెసిడెంట్స్కి పిలుపునిచ్చారు. అలాగే షేక్ మొహ్మద్ హిందీలోనూ, ఇంగ్లీషులోనూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రజల తరఫున భారత ప్రధాని నరేంద్రమోడీకీ, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు షేక్ మొహమ్మద్. దీపావళి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు. ఇదిలా వుంటే, షేక్ మొహమ్మద్ శుభాకాంక్షల పట్ల స్పందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ, అరబిక్ అలాగే ఇంగ్లీషులలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దుబాయ్ అంతటా దీపావళి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. దీప కాంతులతో దుబాయ్ వెలిగిపోయింది. రంగోలీ డిజైన్స్, దీపాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపిక చేసిన ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫైర్ వర్క్ షో నిర్వహించగా, వీటిని తిలకించేందుకు పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!