దుబాయ్ పోలీస్ - ఫ్లయింగ్ మోటర్ సైకిల్ వినియోగం
- November 08, 2018
దుబాయ్:2020 నాటికి దుబాయ్ పోలీసులకు ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ అందుబాటులోకి రానుంది. ఓ వీడియోలో ఈ ఫ్లయింగ్ మోటార్‌సైకిల్ గురించిన వివరాల్ని తెలిపారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి ట్రెయినింగ్ తీసుకుని, సార్కిపయన్3 హోవర్ బైక్‌ని వినియోగిస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. బైక్‌ని కంట్రోల్ చేయడానికి సంబంధించి సునిశిత శిక్షణ అవసరం. శిక్షణ అనంతరం బైక్‌ని అధికారులు వినియోగిస్తున్నారు. గాల్లోకి వెళ్ళడం, తిరిగి సేఫ్‌గా ల్యాండ్ అవడం అతి ముఖ్యమైన అంశాలు. దుబాయ్ పోలీస్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ రజ్సౌకి మాట్లాడుతూ, ఈ బైక్ రాకతో పోలీసు వ్యవస్థ సమర్థత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 114 కిలోల బరువుండే స్కార్పియాన్ 3, కార్బన్ ఫైబర్ మోనోకోక్ ఫ్రేమ్‌ని కలిగి వుంటుంది. చిన్న చిన్న ప్రాంతాల్లో తేలిగ్గా ఈ బైక్ ల్యాండ్ అవగలదు. గంటకు 96 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని ఇది అందుకుంటుంది. 2020 నాటికి స్కార్పియన్ త్రీ, దుబాయ్ పోలీస్ సర్వీస్‌లోకి చేరనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!