కాలు లేదు, అయినా ఫిట్‌నెస్‌పై ఇష్టం తగ్గలేదు
- November 10, 2018అబుదాబీ:పాలస్తీనా జాతీయుడు, అబుదాబీ రెసిడెంట్ అయిన 33 ఏళ్ళ తారెక్ అల్ సక్కా, 2012లో జరిగిన ఓ ప్రమాదంలో కాలుని కోల్పోయాడు. ఆ ఘటన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందంటాడు తారెక్. జీవితం విలువ ఏంటో తనకు ఆ ఘటనతో తెలిసిందని చెబుతున్న తారెక్, అప్పటినుంచి ఫిట్‌నెస్‌పై అవగాహనను పెంచుకున్నాడు. 30 రోజుల దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేసిన తారెఖ్, దీన్నొక అద్భుతమైన అవకాశంగా మలచుకుంటున్నట్లు చెప్పాడు. ఓ కాలు లేకపోయినా, ఫిట్‌నెస్‌పై తనకు ఇష్టం పెరిగిందే తప్ప, తగ్గలేదని నిరూపిస్తూ కష్టతరమైన కసరత్తుల్నీ సులువుగా చేయగలుగుతున్నాడు. తారెక్ ఫిట్నెస్ కోసం చూపుతున్న శ్రద్ధ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ కాలిని రెగ్యులర్ రన్నింగ్ కోసం వినియోగిస్తున్న తాను, స్విమ్మింగ్ కోసం మాత్రం వాటర్ ప్రూఫ్ లెగ్‌ని వినియోగిస్తున్నట్లు తారెక్ చెబుతున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు