బన్నీ ని చుట్టుముట్టిన అభిమానం..
- November 10, 2018స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య సినిమాలకు కొంత విరామం ఇచ్చాడు. తనను నిరాశకు గురిచేసిన చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా నుంచి కోలుకోవడానికి కొంత టైమ్ పట్టింది. తన తరువాతి చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉండబోతుందని సమాచారం.
టాలీవుడ్లోనే కాదు మాలీవుడ్‌లో కూడా బన్నీకి స్టార్ ఇమేజ్ ఉంది. తాజాగా కేరళ ప్రభుత్వం బన్నీని ఆహ్వానించింది. అక్కడ ప్రతి ఏటా జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. నవంబర్ 10 నుంచి నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి బన్నీకేరళకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌లో అర్జున్‌ని చూసిన అభిమానులు అతడిని చుట్టుముట్టారు. కేరళలో అత్యధిక మార్కెట్ ఉన్న టాలీవుడ్ హీరో అర్జున్ కావడం విశేషం.
అందుకే అర్జున్‌ని చూడగానే అభిమానులు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ప్రతి చిత్రంలోనూ ఓ కొత్త లుక్‌లో కనిపించే బన్నీ అంటే యూత్‌లో చాలా క్రేజ్. కేరళకు వెళ్లినప్పుడు కూడా బన్నీ సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. బన్నీ కొత్త గెటప్ త్రివిక్రమ్ సినిమా కోసమేనని అభిమానులు ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్‌లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్‌కు సర్వంసిద్ధం..
- పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన