చిత్తైన రాఖీసావంత్, ఆసుపత్రిలో అడ్మిట్
- November 11, 2018రెజ్లింగ్ అంటే వెండితెరపై ఆడిపాడినంత తేలిక కాదనే విషయం బాలీవుడ్ స్పెషల్ బ్యూటీ రాఖీసావంత్‌కి కళ్లకు కట్టినట్టు అర్థమైంది. సీడబ్ల్యుఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఫారెన్‌కి చెందిన రోబెల్ అనే వుమెన్ రెజ్లర్ ఓ ఛాలెంజ్ విసిరింది. తనతో పోటీపడే మహిళ పంచకులలో ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చని సవాల్ చేసింది. అక్కడేవున్న రాఖీసావంత్ వెంటనే స్పందించి రింగ్‌లోకి దూకింది.
ఈ క్రమంలో రాఖీ, తనతో ఒక పాటకు డ్యాన్స్ చేయాలని రోబెల్కు ఛాలెంజ్ విసిరింది. వెంటనే స్వీకరించిన ఆమె.. డాన్స్ పూర్తి చేసిన వెంటనే రింగ్లోవున్న రాఖీని అమాంతం పైకెత్తి గాలిలోకి లేపి కింద పడేసింది. దీంతో గాయాల పాలైంది రాఖీసావంత్. ఈ ఘటన తర్వాత దాదాపు నాలుగైదు నిముషాలు బాధతో విలవిలలాడిపోయింది.
ఐతే, అక్కడున్న ప్రేక్షకులు రాఖీని చూసి సీడబ్ల్యుఈ ఛాంపియన్ షిప్ కార్యకర్త అనుకుని లైట్‌గా తీసుకున్నారు. చివరకు రాఖీ బాధపడటాన్ని గమనించిన నిర్వాహకులు వెంటనే ఆమెని రింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన చండీగఢ్‌లోని పంచకులలోని తావూదేవి లాల్స్టేడియంలో జరిగింది. ప్రస్తుతం రాఖీ.. జీరఖ్పూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటోంది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు