తమన్నా, సందీప్.. ‘నెక్ట్స్ ఏంటి’ సినిమా...
- November 14, 2018యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్.. నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న మూవీ ‘నెక్ట్స్ ఏంటి’.
ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమా కి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ‘ఫనా’, ‘హమ్ తుమ్’ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి ఈ మూవీకి దర్శకత్వంలో వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నవదీప్, పూనమ్ కౌర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
కథకళి, కిల్లింగ్ వీరప్పన్ వంటి చిత్రాల్ని గ్రాండ్ గా రిలీజ్ చేసిన నిర్మాత గౌరీ కృష్ణ.. ఈ క్రేజీ ప్రాజెక్టు తెలుగు హక్కుల్ని దక్కించుకున్నారు. ‘నెక్ట్స్ ఏంటి’ మూవీని డిసెంబర్ ప్రథమార్థంలో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు శ్రీ కృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరి కృష్ణ.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..