అద్దెలపై చర్చించనున్న అడ్వైజరీ కౌన్సిల్
- December 22, 2015
ఖతార్ లో పెరిగిపోతున్న హౌసింగ్, కమర్షియల్ రెంటల్స్‌పై అడ్వయిజరీ కౌన్సిల్ చర్చించనుంది. కొత్తగా ఏమైనా కార్యాలయాలు స్థాపించాలన్నా, ఒక చోట నుంచి ఇంకో చోటకి నివాసాన్ని సామాన్యులు మార్చుకోవాలన్నా తలకు మించిన భారమవుతోందనీ, అది దేశ ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించడానికి అడ్వయిజరీ కౌన్సిల్ సమావేశం కానుంది. కౌన్సిల్ ఇప్పటికే సమావేశానికి సంబంధించి ఎజెండాను ఖరారు చేసింది. సమావేశంలో చర్చించి, కొన్ని నిర్ణయాలు తీసుకుని, వాటిని మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డాక్టర్ సలే బిన్ మహ్మద్ అల్ నబిద్కి అందజేస్తారు. తదుపరి సమావేశంలో ఆయనే స్వయంగా అడ్వైజరీ కౌన్సిల్‌తో సమావేశమయి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇతర దేశాల నుంచి ఖతార్ వచ్చేవారికి అందుబాటులో లేని అద్దెలు ఇబ్బందిగా పరిణమించడాన్ని కౌన్సిల్ ప్రాధాన్యతాంశంగా చేర్చింది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









