వికలాంగుల పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా

- December 22, 2015 , by Maagulf
వికలాంగుల పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే భారీ జరీమానా

వికలాంగులకు కేటాయించిన పార్కింగ్‌ ప్రాంతాల్లో ఇతరులు తమ వాహనాల్ని పార్కింగ్‌ చేసినట్లయితే 1000 దిర్హామ్‌లు ఫైన్‌ చెల్లించాల్సి వస్తుంది. అలాగే 4 బ్లాక్‌ పాయింట్స్‌ కూడా వారి ఖాతాలో జమ అవుతాయి. దుబాయ్‌ పోలీసు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. వికలాంగులను గౌరవించాలనీ, వారికి ఇబ్బందులు కలిగించకుండా ఉండేందుకు అవగాహనా కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు దుబాయ్‌ పోలీసులు. పది రోజులపాటు ఈ క్యాంపెయిన్‌ని నిర్వహిస్తారు. 'వారికి అండగా వుండండి, వారి ప్లేస్‌ని ఆక్యుపై చెయ్యొద్దు..' అనే స్లోగన్‌తో అవగాహన చేపట్టనున్నారు. 2012లో ఈ తరహా నిబంధనల ఉల్లంఘన కేసులు 9,893 నమోదు కాగా, 2013లో 8,317, 2014లో 9,405, 2015లో 10,265 కేసులు కేవలం పదకొండు నెలల్లోనే నమోదయ్యాయని అధికారులు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నిబందనల్ని ఉల్లంఘించేవారిని గుర్తించనున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com