వెడ్డింగ్ హాల్: 40 మందిని బలిగొన్న మానవబాంబు

- November 21, 2018 , by Maagulf
వెడ్డింగ్ హాల్: 40 మందిని బలిగొన్న మానవబాంబు

అఫ్గనిస్థాన్‌ : పచ్చని పెండ్లి మండపం. కళకళలాడుతు పెండ్లి విందులో ఆనందం అంతా మాదే అన్నట్లుగా వుండే ఆ పెండ్లి మండపం క్షణాల్లో శశ్మానంగా మారిపోయింది. నవ్వులు పూసిన చోట మృత్యువు విలయతాండవం చేసింది. మరో మారణ హోమానికి తెరతీరారు ఆత్మాహుతి దళం. అనారిక ఆలోచనలతో పచ్చని పెండ్లి మండపాన్ని శశ్మానంగా మార్చేశారు నరరూప రాక్షసులు. దేశంలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు దేశ రాజధాని కాబూల్‌లోని ప్రముఖ వెడ్డింగ్ హాల్‌ను లక్ష్యంగా చేసుకుని పాల్పడ్డ ఆత్మాహుతి దాడిలో దాదాపు 40 మంది మృతిచెందగా, మరో 70 మందికి పైగా గాయపడ్డారు. అప్పటివరకూ సందడిగా ఉన్న హాల్ సెకన్ల వ్యవధిలో మృతులదిబ్బగా మారిపోయింది. క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటిపోయాయి.
ఇస్లాం మత ప్రవక్త మహ్మద్ జయంతి సందర్భంగా కాబూల్‌లోని వెడ్డింగ్‌ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 40 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని కాబూల్ పోలీసు అధికారి బషిర్ ముజాహిద్ వెల్లడించారు. కాబూల్‌లోని విమానాశ్రయం రోడ్డులో ఉన్న ఉర్నాస్‌ వెడ్డింగ్‌ హాల్‌ను లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రసంస్థ ప్రకటన చేయలేదని అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com