రోడ్డు ప్రమాదం: బాధితుడికి ఎయిర్ లిఫ్ట్ ద్వారా వైద్య చికిత్స
- November 23, 2018
అబుదాబీ పోలీస్ ఎయిర్ వింగ్, ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసి, ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి తక్షణ వైద్య సహాయం అవసరమవడంతో ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో మరో వ్యక్తి గాయపడగా, అతనికి అత్యవసర వైద్య చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. లైట్ బస్ ఒకటి, హెవీ ట్రక్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అల్ అజ్బాన్ బ్రిడ్జికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అల్ రహ్బా ఆసుపత్రిలో బాధితులకు వైద్య చికిత్స అందిస్తున్నారు. అబుదాబీ పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ - ట్రాఫిక్ డిపార్ట్మెంట్ బ్రిగేడియర్ సలెమ్ బిన్ బ్రాక్ అల్ దహెరి మాట్లాడుతూ, రాంగ్ యూ టర్న్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







