బోయింగ్ 777ను లాగిన దుబాయ్ పోలీస్ విమెన్
- November 23, 2018
దుబాయ్:ఎమిరేట్స్‌కి చెందిన బోయింగ్ 777 - 300 ఆర్ విమానాన్ని, 100 మీటర్ల మేర లాగి దుబాయ్ పోలీస్ విమెన్ తమ సత్తా చాటారు. ఈ ఘనత సాధించడం ద్వారా పోలీస్ విమెన్ గిన్నీస్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఫీట్‌ని చేపట్టారు దుబాయ్ పోలీస్‌కి చెందిన మహిళలు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, బోయింగ్ 777 విమానాన్ని లాగిన మహిళా పోలీసుల్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







