బోయింగ్ 777ను లాగిన దుబాయ్ పోలీస్ విమెన్
- November 23, 2018దుబాయ్:ఎమిరేట్స్‌కి చెందిన బోయింగ్ 777 - 300 ఆర్ విమానాన్ని, 100 మీటర్ల మేర లాగి దుబాయ్ పోలీస్ విమెన్ తమ సత్తా చాటారు. ఈ ఘనత సాధించడం ద్వారా పోలీస్ విమెన్ గిన్నీస్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఫీట్‌ని చేపట్టారు దుబాయ్ పోలీస్‌కి చెందిన మహిళలు. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి, బోయింగ్ 777 విమానాన్ని లాగిన మహిళా పోలీసుల్ని అభినందించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం