జ్యువలరీ అరేబియాలో అతి పెద్ద రింగ్ డిస్ప్లే
- November 24, 2018
సౌదీ అరేబియా:జ్యువలరీ అరేబియాలో అరిహంత్ జ్యుయెలర్స్ ఇహెచ్ 170 బూత్ వద్ద భారీ రింగ్ కొలువు దీరింది. 21 క్యారెట్ నజ్మత్ తైబా, స్టార్ ఆఫ్ టైబగా పిలవబడే ఈ రింగ్ ఇప్పటికే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఈ రింగ్‌కి 3 మిలియన్ డాలర్ల ధరను నిర్ణయించింది. ఈ రింగ్ బరువు 64 కిలోగ్రాములు. ఇందులో 5.1 కిలోల బరువుగల విలువైన స్టోన్స్, డైమండ్స్ పొదగబడి వున్నాయి. అలాగే 615 స్వరోవ్స్కి క్రిస్టల్స్‌ని కూడా ఈ రింగ్‌లో పొదిగారు. 45 రోజుల్లో 450 గంటలపాటు 55 మంది జ్యుయెల్ స్మిత్స్ దీన్ని 2000 సంవత్సరంలో తయారు చేశారు. అప్పట్లో ఇందుకోసం 547,000 డాలర్లు ఖర్చు చేశారు. బహ్రెయిన్ వాసులు ఈ రింగ్‌ని చూసేందుకు పెద్దయెత్తున ఆసక్తి చూపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్