రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసిన సివిల్‌ డిఫెన్స్‌

- November 24, 2018 , by Maagulf
రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసిన సివిల్‌ డిఫెన్స్‌

బహ్రెయిన్:జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌, అన్‌స్టేబుల్‌ వెదర్‌ నేపథ్యంలో జనరల్‌ సేఫ్టీ ఇన్‌స్ట్రక్షన్స్‌ జారీ చేశారు. ఇళ్ళల్లోకి రెయిన్‌ వాటర్‌ ప్రవేశించినప్పుడు, అత్యవసర వస్తువుల్ని ఫస్ట్‌ ఫ్లోర్‌కి తరలించడం, ఎలక్ట్రిసిటీని డిస్‌కనెక్ట్‌ చేయడం తప్పనిసరి అని డైరెక్టరేట్‌ పేర్కొంది. ఎవరూ ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్‌ని టచ్‌ చేయరాదు. బ్యాటరీల సహాయంతో పనిచేసే టార్చ్‌లను ఉపయోగించాల్సి వుంటుందని అధికారులు సూచించారు. వాహనాలు తగిన వేగంతో మాత్రమే నడపాలని సూచించిన అధికారులు, లోతట్టు ప్రాంతాల వైపు వాహనాలు వెళ్ళనీయకుండా జాగ్రత్తపడాలని కోరారు. సీఫేరర్స్‌, సెయిలింగ్‌ సిమ్మింగ్‌ చేయకుండా కోస్ట్‌గార్డ్‌ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సమయాల్లో ఎమర్జన్సీని సంప్రదించాలని కోస్ట్‌గార్డ్‌ పేర్కొంది. మొదటి రెండో స్పెల్స్‌లో కింగ్‌డమ్‌ వ్యాప్తంగా పలు చోట్ల డ్యామేజీ జరిగింది. సదరన్‌ గవర్నరేట్‌ ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com