తీవ్రస్థాయికి చేరిన పెట్రోధరలపై ఆందోళనలు

- November 24, 2018 , by Maagulf
తీవ్రస్థాయికి చేరిన పెట్రోధరలపై  ఆందోళనలు

పారిస్‌: ఫ్రాన్స్‌లో పెట్రోధరలపై వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ ఆందోళనల్లో వాహన డ్రైవర్లు, రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు పాల్గొంటున్నాయి. 'ఎల్లో వెస్ట్‌'ల పేరుతో జరుగుతున్న ఆందోళనల్లో నేడు ఏడుగురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. పెట్రో ధరలపై పన్నులను తగ్గించాలంటూ ఈ ఆందోళనలను చేపట్టారు. ఒక్క పారిస్‌లో జరిగిన ఆందోళనల్లోనే దాదాపు 30వేల మందికిపైగా పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక వ్యక్తి గ్రెనేడ్‌ పట్టుకొని అధ్యక్షభవనం వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో దేశ అధ్యక్ష భవనం వద్ద ఆందోళనలు చేయడాన్ని నివారిస్తూ ప్రభుత్వం నిషేధించింది. ఈ ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వాహనదారులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఆయుధాలను కూడా వాడుతున్నారు. ఈ ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com