మణిరత్నం కొత్త సినిమా కబర్
- November 25, 2018
మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది ఆయన సినిమా. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..'ఓకే బంగారం'తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు. అయితే వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన 'కాట్రు వెలియిదాయ్' చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. 'చెక్క చివంద వానమ్' (తెలుగులో 'నవాబ్') తో మణిరత్నం తిరిగి ఫాంలోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో మణిరత్నం తదుపరి సినిమా ఉండబోతుందని సమాచారమ్. ఇదీకూడా మల్టీస్టారర్ సినిమాయే అని చెబుతున్నారు. విజయ్, విక్రమ్, శింబు కాంబినేషన్లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారంట మణి. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక, తెలుగు హీరోల్లో రామ్ చరణ్, నానిలతో మణిరత్నం సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. వాస్తవానికి ఓకే బంగారం రామ్ చరణ్ తో అనుకొన్నారు. ఆ కథ చరణ్ కి సూటవ్వదని భావించిన మణిరత్నం సల్మాన్ దుల్కర్ తో కానిచ్చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!