పంజాబ్ నుండి పాక్ కు రహదారి మార్గానికి శంకుస్థాపన
- November 26, 2018
న్యూఢిల్లీ : పంజాబ్‌లో డేరాబాబా నానక్ నుండి పాకిస్తాన్లో గల కర్తార్‌పూర్‌కు నిర్మించే ఆరు కిలోమీటర్ల దూరం గల రహదారికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌లు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. విభజన అనంతరం మూసివేసిన ఈ మార్గాన్ని పున:ప్రారంభించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను పున:ప్రారంభించినట్లు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా, బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కర్తార్‌పూర్‌లో శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే ఏడాది గురునానక్ 550 జయంతి సందర్భంగా నవంబర్ 2019 నాటికి కర్తార్‌పూర్‌లోని సాహిబ్ గురుద్వారాను సందర్శించేందుకు వీలుగా ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పాకిస్తాన్‌తో సంబంధాలు మరింత మెరుగుపడగలవని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







