కువైట్, ఇరాక్‌లో కంపించిన భూమి
- November 26, 2018
రాన్ సరిహద్దుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. దీని ప్రభావం భాగ్దాద్, కువైట్లలో కూడా కనిపించింది. భూకంపం సంభవించడంతో 200 నుంచి 210 మంది వరకు తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అయితే భూకంపం ఘటనలో ఎవరూ మృతిచెందలేదని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్డుపైకి పరుగులు తీశారు. భూకంపం ధాటికి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో పరుగులు తీస్తుండగా గాయపడ్డారని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉంటే భూకంపం తర్వాత వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో విద్యుత్‌ను తిరిగి పునరుద్ధరించినట్లు చెప్పారు. భూకంపం ధాటికి కొండచరియలు విరిగి పడ్డట్లు అధికారులు వెల్లడించారు. ఇరాక్‌తో సరిహద్దు నగరంగా ఉన్న ఇరాన్ నగరం ఇలామ్కు ఈశాన్య దిశలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇదిలా ఉంటే ఇరాన్ ప్రావిన్స్‌లోని ఏడు ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కనిపించిందని ఇరాన్ మీడియా తెలిపింది. ఈ భూకంపం తీవ్రత ఎక్కువగా కెర్మాన్షా ప్రాంతంలో కనిపించింది. గతేడాది ఇక్కడ భూకంపం సంభవించడంతో దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు.
భూకంపం ప్రభావం ఇటు కువైట్‌లో కూడా స్పష్టంగా కనిపించింది. భూమి కంపించినట్లు అనిపించడంతో ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇక్కడ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అంతా సర్దుకుందని అధికారులు ప్రకటన చేశారు.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..