మస్కట్‌లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత

- November 27, 2018 , by Maagulf
మస్కట్‌లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత

మస్కట్‌: అల్‌ ఇనా&ష్రా స్ట్రీట్‌పై ఒక లేన్‌ని మూసివేయనున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ పేర్కొంది. మదినాత్‌ సుల్తాన్‌ కబూస్‌లో ఈ రోడ్డు ఉంది. గురువారం నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఈ రోడ్డుని మూసివేయడం జరుగుతుంది. మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తం రోడ్డుపై లేన్‌ మూసివేయడం జరుగుతుందనీ, వాహనదారులు ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని వాహనదారులు వినియోగించుకోవాల్సి వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com