యూఏఈ మొబైల్ నెట్వర్క్స్కి కొత్త పేర్లు
- November 28, 2018
యూఏఈ టెలికమ్ నెట్వర్క్ ప్రొవైడర్స్ డు మరియు ఎటిసలాట్ తమ నెట్ వర్క్స్ పేర్లను '30 నవంబర్'గా మార్చాయి. కమ్మొమరేషన్ డే (గతంలో మార్టీర్స్ డేగా వ్యవహరించేవారు) గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి ఆయా సంస్థలు. అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేసుకునేందుకు తమవంతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎటిసలాట్, ట్విట్టర్లో పేర్కొంది. ప్రతి యేడాదీ నవంబర్ 30వ తేదీని కమ్మొమరేషన్గా పాటిస్తూ వస్తున్నారు. తొలి ఎమిరేటీ, దేశం కోసం ప్రాణం విడిచిన రోజు అది. ఉదయం 8 గంటలకు యూఏఈ ఫ్లాగ్ హాఫ్ మాస్ట్ జరుగుతుంది. ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో ఒక నిమిషంపాటు మౌనం పాటిస్తారు. మినిస్టర్స్, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఆ తర్వాత ఫ్లాగ్ని రెయిజ్ చేస్తారు.. జాతీయ గీతం ఆలపించబడుతుంది. ఇదిలా వుంటే, ఎటిసలాట్.. డు వినయోగదారులు నెట్ వర్క్ పేరు మార్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!