డిసెంబర్ 7న బెల్లంకొండ శ్రీనివాస్ కవచం విడుదల..
- November 28, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహ్రీన్ ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కవచం. ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. టీజర్ 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ అందుకుని.. అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ తో శ్రీనివాస్ మామిళ్ళ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కెరీర్‌లో తొలిసారి ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కవచం షూటింగ్ పూర్తైంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ సంస్థలో నవీన్ సొంటినేని(నాని) కవచం సినిమాను నిర్మిస్తున్నారు.
నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీనివాస్ మామిళ్ళ
నిర్మాత: నవీన్ చౌదరి సొంటినేని (నాని)
నిర్మాణ సంస్థ: వంశధార క్రియేషన్స్
సహ నిర్మాత: చాగంటి సంతయ్య
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫర్: ఛోటా కే నాయుడు
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: చిన్నా
పిఆర్ఓ: వంశీ శేఖర్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!