షార్జాలో 28 ఎయిర్‌ కండిషన్డ్‌ పబ్లిక్‌ బస్‌ షెల్టర్స్‌ ప్రారంభం

- November 28, 2018 , by Maagulf
షార్జాలో 28 ఎయిర్‌ కండిషన్డ్‌ పబ్లిక్‌ బస్‌ షెల్టర్స్‌ ప్రారంభం

షార్జా:షార్జా రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, ప్రయాణీకుల సౌకర్యార్ధం 28 ఎయిర్‌ కండిషన్డ్‌ పబ్లిక్‌ బస్‌ షెల్టర్స్‌ని ప్రారంభించింది. మొత్తం 172 బస్‌ షెల్టర్స్‌కి ఇదివరకే ప్లాన్‌ చేసిన సంగతి తెల్సిందే. మొత్తం 16 మిలియన్‌ దిర్హామ్‌లతో వీటిని నిర్మించనున్నారు. 28 ఇప్పటికే పూర్తి కాగా, మిగతావి నిర్మాణ దశలో వున్నాయి. అంతర్జాతీయ స్థాయి వసతులతో, సోలార్‌ పవర్డ్‌ బస్‌ స్టాప్స్‌గా వీటిని రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని బస్‌ షెల్టర్స్‌ని ప్రారంభించనున్నట్లు సుప్రీం కౌన్సిల్‌ మెంబర్‌, షార్జా రూలర్‌ షేక్‌ డాక్టర్‌ సుల్తాన్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ కాసిమి చెప్పారు. అన్ని బస్‌ షెల్టర్స్‌ ఎల్‌ఇడి స్క్రీన్స్‌ కలిగి వుంటాయని, పబ్లిక్‌ బస్‌ రూట్స్‌కి సంబంధించి నెంబర్‌, టైమింగ్‌ అక్కడ డిస్‌ప్లే అవుతాయని ఎస్‌ఆర్‌టిఎ డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎఫైర్స్‌ అబ్దుల్‌అజీజ్‌ అల& జర్వాన్‌ చెప్పారు. కొత్త బస్‌ షెల్టర్స్‌ 10 నుంచి 15 మందికి ఒకేసారి అకామడేట్‌ చేయగలవు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇవి పనిచేస్తాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com