అందరూ పెళ్లి చేసుకుంటున్నారు:రాఖీ సావంత్
- November 30, 2018
బాలీవుడ్ భామలంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందరికీ పెళ్లిపై మనసు పోతోంది. మొన్న దీపికా పదుకొణే రణ్వీర్తో మూడు ముళ్లు వేయించుకుంది. మరో రెండు రోజుల్లో ప్రియాంక పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వీరి పెళ్లి ముచ్చట్లు వినేసరికి హాట్ భామ రాఖీ సావంత్‌కి కూడా పెళ్లిపై మనసు పోయినట్లుంది
ఇండియా గాట్ టాలెంట్ యాక్టర్ దీపక్ కాలాల్ని పెళ్లాడనున్నట్లు సిగ్గుపడుతూ చెబుతోంది. పెళ్లి డేట్, వివాహ వేదికను కూడా అభిమానులకు తెలియజేసింది. డిసెంబర్ 31 సాయింత్రం 5.55 నిమిషాలకు లాస్ ఏంజెల్స్‌లో వివాహం చేసుకోనున్నట్లు రాఖీ సావంత్ తెలిపింది.
వెడ్డింగ్ కార్డ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసిన రాఖీ.. తన మనసులోని మాటను బయటపెట్టింది. ఇండస్ట్రీలో అందరూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అందుకే నాక్కూడా చేసుకోవాలనిపించింది. ఇదే సరైన సమయమని పెళ్లి వార్తను బయటపెట్టాను అని అంటోంది.
డిసెంబర్ 2న ప్రియాంక చోప్రాది, 13న శ్వేతా బసు ప్రసాద్‌ది, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కూతురు ఈషా అంబానీది, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ వివాహం కూడా ఈ నెలలోనే జరగనున్నాయి. మొత్తానికి డిసెంబర్ నెల సెలబ్రిటీల పెళ్లి వేదికగా మారనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!