యూఏఈలో డిసెంబర్‌ కోసం పెట్రో ధరల ప్రకటన

- November 30, 2018 , by Maagulf
యూఏఈలో డిసెంబర్‌ కోసం పెట్రో ధరల ప్రకటన

యూఏఈ:మినిస్ట్రీ ఆఫ్‌ ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రీ ప్రకటించిన డిసెంబర్‌ పెట్రో ధరలు వాహనదారల హర్షాన్ని పొందుతున్నాయి. సూపర్‌ 98 ధర 2.25 లీటర్‌గా నిర్ధారించారు. నవంబర్‌లో ఈ ధర 2.57 దిర్హామ్‌లుగా వుంది. స్పీడ్‌ 95 ధర 2.15గా మార్చారు. దీని ధర నవంబర్‌లో 2.46. ఇ ప్లస్‌ 91 ధర 2.05 దిర్హామ్‌లు కాగా, నవంబర్‌లో ఈ ధర 2.38 దిర్హామ్‌లు. డీజిల్‌ ధర 2.61కి తగ్గింది. నవంబర్‌లో డీజిల్‌ ధర లీటర్‌కి 2.87 దిర్హామ్‌లుగా వుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరల ఆధారంగా ఈ ధరల మార్పు జరిగింది. వాహనదారులు, అంతర్జాతీయ మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకుని డిసెంబర్‌లో భారీగా పెట్రో ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఎక్స్‌పర్ట్స్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com