పాట తో పంచ్ విసిరిన మేరీ
- November 30, 2018
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిలో ఆరోసారి స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించి తన పేరుకు సుస్థిర స్థానాన్ని కల్పించుకున్నారు మేరీకోమ్. తన పంచ్‌లతో ప్రత్యర్థులను కట్టడి చేసే ఆమెకు ఎవరికి తెలియని మరో టాలెంట్ కూడా ఉంది. ఓ కార్యక్రమంలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాటను చాలా అద్భుతంగా పాడి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె పాటతో విసిరిన పంచ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. 1960లో వచ్చిన 'దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి' సినిమాలో లతా మంగేష్కర్ పాడిన 'అజైబ్ దస్తాన్ హై యెహ్..' పాటను చాలా వినసొంపుగా పాడారు. 'ఆమె బాక్సింగ్ చేయగలదు, అలాగే పాట కూడా పాడగలదు, అమేజింగ్ మేరీ..', 'చాలా గర్వంగా ఉంది మిసెస్ మేరీకోమ్', 'ఆమె రింగ్‌లో గెలవడమే కాదు, పాటతో హృదయాలను గెలుచుకున్నారు' అని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!