28న విడుదల కానున్న బ్లఫ్ మాస్టర్..

- December 01, 2018 , by Maagulf
28న విడుదల కానున్న  బ్లఫ్ మాస్టర్..

ఆశ, అత్యాశల నేపథ్యంలో రూపొందిన తమిళ మూవీ`చతురంగ వేట్టై` తెలుగలో బ్లఫ్ మాస్టర్ పేరుతో రీమేక్ చేశారు. . అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై ఈ చిత్రానికి నిర్మాత .గోపీ గణేష్ పట్టాభి దర్శకుడు . `జ్యోతిలక్ష్మి`, `ఘాజి` చిత్రాల ఫేమ్ సత్యదేవ్ హీరోగా నటించారు . `ఎక్కడికి పోతావు చిన్నవాడా` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నందితా శ్వేత ఇందులో నాయిక. ఈ మూవీ ఈ నెల 28వ తేదిన విడుదల కానుంది. ఈ మూవీకి సునీల్ కాశ్యప్ సంగీతం సమకూర్చాడు.. ఆదిత్యామీనన్‌, పృథ్వి, బ్రహ్మాజీ, సిజ్జు, చైతన్య కృష్ణ, ధన్‌రాజ్‌, శ్రీరామరెడ్డి , వేణుగోపాలరావు, ఫిష్ వెంకట్‌, బన్నీ చందు, `దిల్‌` రమేష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ: హెచ్‌.డి.వినోద్‌, అడిషనల్ డైలాగ్స్: పులగం చిన్నారాయణ ,సంగీతం: సునీల్ కాశ్యప్‌, ఎడిటర్‌: నవీన్ నూలి, ఆర్ట్: బ్రహ్మ కడలి, కెమెరా: దాశరథి శివేంద్ర , కో డైరక్టర్‌: కృష్ణకిశోర్‌, ప్రొడక్షన్ కంట్రోలర్స్: ఆర్‌.సెంథిల్‌, కృష్ణకుమార్‌,నిర్మాత: రమేష్ పిళ్లై, మాటలు -దర్శకత్వం: గోపీగణేష్ పట్టాభి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com