బ్లాక్ మనీ ఖాతాదారుల లిస్ట్ ఇస్తాం
- December 03, 2018
న్యూ ఢిల్లీ: భారతీయులకు సిట్జర్లాండ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారతీయుల కల ఈనాటికి నెరవేరే అవకాశాలన్ని స్విస్ ప్రభుత్వం ఇవ్వనుంది. భారతదేశంలో అక్రమంగా సంపాదించిన డబ్బులను అదే అక్రమ రీతిలో విదేశాలను తరలించిన బ్లాక్ మనీ ఖాతాదారుల గుట్టు బైపడునుంది. ఈ మేరకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం బ్లాక్ మనీ ఖాతాదారుల లిస్ట్ ను వెల్లడించేందుకు నిర్ణయం తీసుకుంది.
నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామనే ఎజెండాతో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ దాదాపు మోదీ ప్రధాని అయిన దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్న బ్లాక్ మనీ తీసుకొచ్చే జాడే కనిపించటంలేదు. దీనిపై విపక్షాలు ఎన్నిమార్లు విమర్శించినా మోదీ నోటి నుండి ఒక్క వివరణగానీ..ఒక్క మాటగానీ రాలేదు. వివరాలు వెల్లడించటం కుదరదని ఇప్పటి వరకూ తెలిపిన స్విస్ బ్యాంక్ ఇప్పుడు హఠాత్తుగా బ్లాక్ మనీ ఖాతాదారుల వివరాలను తెలియజేస్తామనీ..వారి లిస్ట్ ఇస్తామనీ కేంద్ర ప్రభుత్వానికి సమచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పినట్లే. భారతదేశంలో భారీ అక్రమాలకు పాల్పడి.. ఆ సొమ్మును విదేశాలలో నిల్వ చేసుకున్న నల్లవీరుల బండారం బట్టబయలు కానుంది స్విస్ బ్యాంక్ అధికారుల ప్రకటనతో. స్విస్ బ్యాంకు ఖాతాదారుల వివరాలను అందించేందుకు స్విస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు కంపెనీలు, ముగ్గురు వ్యక్తుల వివరాలు అందించనున్నట్టు స్విస్ ప్రభుత్వం తెలిపింది.
తమిళనాడులోని జియోడెసిక్ లిమిటెడ్, ఆది ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, జియో డెసిక్ కంపెనీ చైర్మన్ పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ శరద్ ములేకర్, ఎండీ కిరణ్ కులకర్ణిలు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని, వారి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విస్ ప్రభుత్వాన్ని కోరింది. భారత విజ్ఞప్తిని అంగీకరించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ వివరాలను అందిస్తామని, వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా పాలనా పరమైన సాయాన్ని భారత్‌కు అందజేస్తామని స్పష్టం చేసింది. 1982లో ఏర్పాటైన జియోడెసిక్, 2014లో ఏర్పాటైన ఆది ఎంటర్‌ప్రైజెస్‌లు ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. దీంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయా కంపెనీల ప్రమోటర్ల ఆస్తులపై దాడులు చేశారు.
ఈ నేపథ్యంలో మరింతమంది నల్లవీరుల జాబితా బైటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఈ నల్లడబ్బు భారతదేశానికి తిరిగి వస్తే..భారతదేశపు ఆర్థిక స్థితిగతులు అమోఘంగా మారిపోయే అవకాశం వుంది. ఏది ఏమైనా ఈనాటికైనా స్విస్ ప్రభుత్వం ఈ నిర్ణయానికి రావటం ఆహ్వానించదగిన విషయం.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







