ఓపెక్‌కు ఖతర్‌ గుడ్‌బై

- December 03, 2018 , by Maagulf
ఓపెక్‌కు ఖతర్‌ గుడ్‌బై

ఖతర్‌:ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్ (ఒపెక్‌) నుంచి తాను వైదొలగనున్నట్లు ఖతర్‌ ప్రకటించింది. జనవరి నుంచి తాము ఒపెక్‌ నుంచి వైదొలగుతామని ఆ దేశ ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నారు. ముడి చమురు సరఫరాను నియంత్రించేదుకు, తాజా పరిస్థితి చర్చించేందుకు ఒపెక్‌ దేశాలు ఈ నెల 6వ తేదీన భేటీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతర్ నిర్ణయం మార్కెట్‌ వర్గాలను ఆశ్చర్యపర్చింది. ఒపెక్‌ వెలుపల వల్ల దేశాల మాదిరిగానే తాము కూడా ముడి సరఫరా ఒప్పందాలను అమలు చేస్తామని ఖతర్‌ పేర్కొంది. ఇప్పటి వరకు ఒపెక్‌ నిర్ణయాలను గౌరవించి ఉత్పత్తిని కంట్రోల్‌ చేశామని, ఇక నుంచి ఒపెక్‌ ఒప్పందాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఖతర్‌ స్పష్టం చేసింది. తాజా సమాచారం మేరకు ఖతర్‌ రోజుకు దాదాపు 7 లక్షల బ్యారెళ్ళ ముడి చమురును ఉత్పత్తి చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com