రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి
- December 04, 2018
మస్కట్: ఓ వాహన ప్రమాదంలో ముగ్గురు వలసదారులు మృతి చెందగా, మరో వలసదారుడు తీవ్రంగా గాయపడ్డారు. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ ప్రమాదం జరిగింది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం మృతులు భారతదేశానికి చెందినవారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం, స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. గాయపడ్డ వ్యక్తిని సుల్తాన్ కబూస్ హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని తఖాలో ఖష్రూబ్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







