బీజేపీపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- December 08, 2018
బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ముస్లిం వ్యతిరేకి, పాకిస్తాన్ వ్యతిరేకి అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, శాంతి చర్చలకు ఆహ్వానించినా స్పందించడం లేదని అమెరికాకు చెందిన ఓ వార్త చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
స్కార్ సమావేశం నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. సార్క్ చార్టర్ సూత్రాలకు అనుగుణంగా నడుచుకుంటుందని 34వ సార్క్ చార్టర్డే వేడుకలో పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెహ్రిమా జాన్జువా తెలిపారు.
అమెరికాలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ముగ్గురు భారతీయులపై కేసులు నమోదయ్యాయి. సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు శాఖ ఖాతదారులకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించి అక్రమంగా బయటికి అందించినట్లు పోలీసులు గుర్తించారు. గన్నమనేని రాజేశ్వర్(36), భారత్‌లో ఉంటున్న తన భార్య గండ్ర దీప్తి(33), తండ్రి గన్నమనేని లింగారావు(68)లకు కీలక, రహస్య సమాచారాన్ని అందజేసినట్లు సెక్యూరిటీస్, ఎక్స్ఛేంజి కమిషన్(ఎస్ఈసీ) ఓ ప్రకటనలో తెలిపింది.
బ్రిటన్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ కోటీశ్వరులకు శాశ్వత నివాసం, పౌరసత్వం కోసం జారీచేస్తున్న గోల్డెన్ వీసా (టైర్ 1 ఇన్వెస్టర్ వీసా)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







