మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని ప్రారంభించిన మన చంద్రబాబు

- December 08, 2018 , by Maagulf

అమరావతి:రూ.1.175 లక్షలతో తయారు చేసిన మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీని అభినందస్తూ ఎంపీ నిధులతో మురళీమోహన్ ఓ మంచి ఆలోచన చేశారని, ఆయన బాటలో మిగిలిన ఎంపీలు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శనివారం ఎంపీ మురళీమోహన్  రాష్ట్రంలో చంద్రన్న సంచార చికిత్స పేరుతో గ్రామలలో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఓ వాహనం అందుబాటులోకి తీసుకువస్తే రాష్ట్రంలో క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చన్నారు.ఈ అంబులెన్స్ ద్వారా గ్రామీణ ప్రజలకు క్యాన్సర్ ముందస్తు పరీక్షలు పూర్తిగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
 క్యాన్సర్ నిర్ధారణకు నేడు అనేక ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం శుభసూచికమన్నారు.క్యాన్సర్ నిర్ధారణ కార్యక్రమాన్ని లాజికల్ గా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. క్యాన్సర్ పై ప్రజల్లో అపోహలు తొలగించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్యశాఖపైనా ఉందన్నారు. అందుకు తగిన వేదిక ఏర్పాటు చేయడంలో ప్రయివేట్ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రయివేట్ ఏజెన్సీలకు అప్పగించడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా వైద్య ఆరోగ్యశాఖకు సూచించారు.
ఎంపీ మురళీమోహన్
ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గ్రామాలలో క్యాన్సర్ చికిత్సలను అందుబాటులో తీసుకువచ్చేందుకు ఈ వాహనం రూపొందించామన్నారు. మండల హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వాహనాన్ని ఉంచి గ్రామలలో ఉన్న ప్రజలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వాహనాలను ఏర్పాటు చేసి క్యాన్సర్ నివారణకు కృషి చేయలనేదే తన ఉద్దేశమని ఎంపీ మురళీమోహన్ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com