పిల్లల మిస్సింగ్: ఫేస్బుక్ అలర్ట్స్
- December 10, 2018
చిన్న పిల్లలు ఎవరైనా మిస్ అయితే, ఇకపై యూఏఈలో ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్ అలర్ట్స్ వస్తాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ మేరకు ఫేస్‌బుక్‌తో కలిసి నిదా (అరబిక్‌లో అలర్ట్) సిస్టమ్‌ని ఏర్పాటు చేసింది. తప్పిపోయిన పిల్లల ఆచూకీ కోసం రీజియన్‌లో ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి అని అధికారులు అంటున్నారు. తమ పిల్లలు తప్పిపోయినప్పుడు, తల్లిదండ్రులు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసిన వెంటనే అలర్ట్స్ ప్రారంభమవుతాయి. నిదా, ఆటోమేటిక్‌గా ఫేస్బుక్ యూజర్స్‌ని అలర్ట్ చేస్తుంది. తప్పిపోయిన పిల్లల తాజా ఫొటోల్ని, అలాగే పూర్తి వివరాల్ని నిదా, యూజర్స్‌కి పంపిస్తుంది. పిల్లలు దొరికిన వెంటనే నిదా సాఫ్ట్వేర్ ఆ అలర్ట్‌ని డిలిట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ లెఫ్టినెంట్ జనరల్ సైఫ్ అబ్దుల్లా అల్ షఫార్ మాట్లాడుతూ, పిల్లల్ని రక్షించేందుకుగాను యూఏఈ సరికొత్త స్టాండర్డ్స్‌ని పాటిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







