అమెరికా లో భారీ మంచు తుఫాన్
- December 10, 2018
అమెరికా:మంచు తుఫాన్ గుప్పిట్లో ఆగ్నేయ అమెరికా బందీ అయింది. బలమైన గాలులు వీయడంతోపాటు భారీగా మంచు కురుస్తుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. దీంతో నార్త్ కరోలినా, జార్జియా, అలబామా, వర్జినీయా, టెన్నెస్సీ, పెన్సిల్వేనియా రాష్ర్టాల్లోని ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప అడుగు బయట పెట్టవద్దని అక్కడి ప్రభుత్వం ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 12 ఇంచుల మందంతో మంచు కురుస్తుండడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బ తినడంతో దాదాపు నాలుగు లక్షల మంది ఇబ్బందులు పడ్డుతున్నారు. వందలాది విమానాలు రద్దవడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







