చెక్ బుక్స్: యూఏఈ బ్యాంకుల కొత్త రూల్
- December 10, 2018
యూఏఈ సెంట్రల్ బ్యాంక్, చెక్ బుక్స్‌కి సంబంధించి కొత్త రూల్‌ని పాస్ చేసింది. యూఏఈలోని అన్ని బ్యాంకులకు ఈ మేరకు సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. బ్యాంకులు, వినియోగదారులకు చెక్‌బుక్స్ జారీ చేసే ముందు, అల్ ఎతిహాద్ క్రెడిట్ బ్యూరో (ఎఇసిబి) ద్వారా తమ వినియోగదారుల క్రెడిట్ వర్తీనెస్ని చెక్ చేసుకోవాల్సి వుంటుంది. అలాగే కొత్త వినియోగదారులకు అత్యధికంగా 10 చెక్స్‌ని మాత్రమే ఇవ్వాల్సి వుంటుంది. ఆరు నెలల తర్వాత, చెక్స్ రిటర్న్ లేకపోతే తదుపరి చెక్‌బుక్స్ జారీ చేయవచ్చు. బ్యాంకులు, వినియోగదారులకు తగిన మొత్తం లేనప్పుడు, ఎఇసిబి నెగెటివ్ ఎఫెక్ట్ ఇస్తుందనే విషయాన్ని తెలియజేయాల్సి వుంటుంది. చెక్‌లను తక్కువగా వినియోగించి, ఇతరత్రా మార్గాల్ని లావాదేవీలకోసం వినియోగించాల్సిందిగా బ్యాంకులు, వినియోగదారులకు తెలియజేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







