క్యుఎన్సిసిలో భారత సింగర్ ప్రదర్శన
- December 13, 2018
దోహా: భారత మెలోడీ కింగ్ కుమార్ సాను, ఖతార్ రెసిడెంట్స్‌ని తన పాటలతో అలరించనున్నారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 28న కుమార్ సాను సంగీత విభావరి జరగనుంది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఈవెంట్‌ని నిర్వహించనున్నారు. 'ఏ కాలి కాలి ఆంకేన్, ఏక్ లడ్కి కో దేఖా, ఆంకో కి గుస్తాకియాన్..' వంటి ఎన్నో అద్భుతమైన పాటలతో కుమార్ సాను, బాలీవుడ్ మెలోడీ కింగ్ అన్పించుకున్నారు. 2009లో భారత ప్రభుత్వం పద్మ పురస్కారంతో కుమార్ సానుని గౌరవించింది. 24 గంటల్లో అత్యధిక పాటల్ని పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు దక్కించుకున్నారు కుమార్ సాను. కాగా, కుమార్ సాను సంగీత విభావరికి వెళ్ళాలనుకునేవారికి 75 ఖతారీ రియాల్స్ నుంచి 300 ఖతారీ రియాల్స్ ధరల్లో టిక్కెట్లు అందుబాటులో వున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







