కేటీఆర్ కు కీలక బాధ్యతలు...
- December 14, 2018
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్‌గా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, సమర్ధుడికి పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ, బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు.
తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు. భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా టిఆర్ఎస్ ను రూపుదిద్దాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటి వరకు అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో ఇచ్చిన బాధ్యతలన్నీ అత్యంత విజయవంతంగా నిర్వహించిన కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు. కేటీఆర్ పనితీరు, నిబద్ధత, దార్శనికత,నాయకత్వ లక్షణాలు టిఆర్ఎస్ పార్టీని సుస్థిరంగా, సుభిక్షంగా నిలుపుతాయని కేసీఆర్ విశ్వసిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ, బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేసింది. తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని ప్రజలు ఏకోన్ముఖంగా భావించి, ఇటీవల ఎన్నికల్లో తిరుగులేని విజయం అందించారు. తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పార్టీపై అచంచల విశ్వాసం ఉంది. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ అత్యంత పటిష్టంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించడం, సంస్థాగతంగా తిరుగులేని శక్తిగా టిఆర్ఎస్ పార్టీని తీర్చిదిద్దే బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







