వృద్ధుడి ప్రాణాలు తీసిన చౌకఫోన్
- December 15, 2018
స్మార్ట్ఫోన్ల యుగం నడుస్తోంది. చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే కాలం నడపదనేవారు చాలామందే వున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ఎంత ప్రమాదమో చాలామంది గ్రహించట్లేదు. అందుకు ఈ ఘటనే నిదర్శనం. రాజస్థాన్ సర్కారు అందించిన చౌక ఫోన్ ఓ వ్యక్తి ప్రాణాలనే బలిగొంది. రాజస్థాన్ సర్కారు అందజేసిన ఫోన్ను జేబులో పెట్టుకున్న పాపానికి ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
జేబులో పెట్టుకున్న ఫోన్ పేలడంతో ఆ వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. ఈ ఘటన రాజస్థాన్లోని నెతావల్ గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, రాజస్థాన్లోని పాచ్లీ గ్రామంలో ఓ వృద్ధుడు ఇటీవల రాజస్థాన్ సర్కారు రూ.1100కు అందజేసిన ఫోనును కొనుగోలు చేశాడు. ఈ ఫోన్ను రాత్రి నిద్రించేటప్పుడు కూడా జేబులో పెట్టుకున్నాడు.
అంతే శుక్రవారం రాత్రి ఒక్కసారిగా జేబులో వున్న ఫోన్ పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని నిద్రిస్తున్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోనులోని ఛార్జర్ వేడి కావడంతోనే అది పేలిపోయిందని.. మంటలు దుస్తులకు బాగా అంటుకుపోవడంతో నిద్రలో వున్న వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెప్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







