న్యూ ఇయర్‌ వైల్డ్‌ పార్టీస్‌: డిపోర్టేషన్‌ హెచ్చరిక

- December 15, 2018 , by Maagulf
న్యూ ఇయర్‌ వైల్డ్‌ పార్టీస్‌: డిపోర్టేషన్‌ హెచ్చరిక

కువైట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌, 'ఎక్స్‌పాండెడ్‌ సెక్యూరిటీ క్యాంపెయిన్‌' పేరుతో, న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టనుంది. పబ్లిక్‌ సెక్యూరిటీ, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌, రెస్క్యూ మరియు ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్స్‌తో కలిసి ఎక్కడికక్కడ తనిఖీలను నిర్వహిస్తారు. న్యూ ఇయర్‌ వైల్డ్‌ పార్టీల పేరుతో రోడ్లపై అసభ్యకరంగా ప్రవర్తించేవారికి, అపార్ట్‌మెంట్లు, విల్లాల్లో అభ్యంతరకరమైన రీతిలో పార్టీలు నిర్వహించేవారికీ షాక్‌ ఇవ్వనున్నారు అధికారులు. సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుంటారనీ, ఉల్లంఘనలకు పాల్పడినవారిని డైరెక్టరేట్‌ జనరల్‌ ఫర్‌ డిపోర్టేషన్‌కి అప్పగిస్తారనీ, అలా డిపోర్ట్‌ చేసినవారికి తిరిగి కువైట్‌లోకి ప్రవేశించే అవకాశం వుండదని అధికారులు హెచ్చరించారు. బ్యాచిలర్‌ ప్రాంతాలు, రోడ్లు, రెస్ట్‌ రూమ్స్‌, అపార్ట్‌మెంట్లు వంటివాటిపై నిఘా ఎక్కువగా వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com