జబీల్‌ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం!

- December 15, 2018 , by Maagulf
జబీల్‌ పార్క్‌లోకి ఉచిత ప్రవేశం!

దుబాయ్‌లో పాపులర్‌ టూరిస్ట్‌ స్పాట్‌ విజిటర్స్‌కి ఉచిత ప్రవేశం కల్పిస్తోంది. దుబాయ్‌ ఫ్రేమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ మేరకు ఓ పోస్ట్‌ దర్శనమిచ్చింది. దుబాయ్‌ ఫ్రేమ్‌ విజిటర్స్‌, జబీల్‌ పార్క్‌లోకి ఉచితంగా ప్రవేశించేందుకు వీలుంటుందన్నది ఆ పోస్ట్‌ సారాంశం. గతంలో విజిటర్స్‌ ఈ పార్క్‌లో ప్రవేశం కోసం 5 దిర్హామ్‌లు చెల్లించాల్సి వచ్చేది. అయితే, పీపుల్‌ ఆఫ్‌ డిటర్మినేషన్‌, అలాగే 2 ఏళ్ళలోపు చిన్నారులకు ఇందులో ఉచిత ప్రవేశం. దుబాయ్‌లో జబీల్‌ పార్క్‌ పెద్దది, ప్రముఖమైనది. 45 ఫుట్‌బాల్‌ మైదానాలతో సమానం ఈ పార్క్‌ వైశాల్యం. పార్క్‌లో లైవ్‌ మ్యూజిక్‌, బార్బిక్యూ మరియు పికినిక్‌ ఏరియాస్‌, రెస్టారెంట్స్‌ మరియు బోట్‌ రైడ్స్‌ అందుబాటులో వున్నాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, గురు - శుక్ర - శనివారాల్లోనూ అధికారిక సెలవు దినాల్లోనూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పార్క్‌ తెరిచి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com