హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి..

- December 15, 2018 , by Maagulf
హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి..

హైదరాబాద్:మానవ శరీరానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, మెదడుని చైతన్యం చేయడానికి పుస్తకాలు అంతే ముఖ్యమని భారత ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన 'హైదరాబాద్ బుక్ ఫెయిర్' ను ప్రారంభించిన
ఆయన మాట్లాడుతూ , పుస్తక మహోత్సవాలు భాషాభివృద్ధికి, భావాభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు. పుస్తకాలు ఏ ఒక్క కులానికో, మతానికో, వర్గానికో, ప్రాంతానికో, భాషకో పరిమితం కావని అన్నారు. లక్ష్మీ కటాక్షం సంగతి ఎలా ఉన్నా, పుస్తక సరస్వతి కటాక్షం ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికీ అందుతుందని, సరస్వతీ దేవికీ పేదాగొప్పా అన్నా తేడా లేదని అన్నారు. 32వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 25 వరకు కొనసాగుతుందని

ఈరోజు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన దేశంలో రెండో స్థానంలో ఉందని, కోల్ కతా తొలి స్థానం ఆక్రమించిందని అన్నారు. కోల్ కతా తొలి స్థానం ఆక్రమించడానికి కారణం అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర గ్రంథాలయాలు, విద్యాలయాలకు అందిస్తుందని, దీనికితోడు బెంగాలీలు సాహిత్య ప్రియులని అన్నారు. అలాంటి సహాయసహకారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి కూడా అందితే, తొలి స్థానాన్ని ఆక్రమించవచ్చని అని సభ ముఖంగా యువత కు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com