ముగిసిన ఇండియన్‌ టాలెంట్‌ స్కాన్‌ ఫెస్టివల్‌

- December 15, 2018 , by Maagulf
ముగిసిన ఇండియన్‌ టాలెంట్‌ స్కాన్‌ ఫెస్టివల్‌

కేరళ కేథలిక్‌ అసోసియేషన్‌ (కెసిఎ) నిర్వహించిన టాలెంట్‌ ఫెస్టివల్‌ ముగిసింది. మొత్తం 150 ఈవెంట్స్‌ ఈ ఫెస్టివల్‌లో చోటు చేసుకున్నాయి. 675 మంది చిన్నారులు ఈ ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. నెల రోజులపాటు పోటీలు జరిగాయి. కింగ్‌డమ్‌లో నివసిస్తోన్న భారత వలసదారుల కోసం ఈ పోటీలు నిర్వహించారు. ఇండియన్‌ టాలెంట్‌ స్కాన్‌ జనరల్‌ కన్వీనర్‌ లియో జోసెఫ్‌ మాట్లాడుతూ, పిల్లల్ని వయసు, హైట్‌లకు తగ్గట్టుగా నాలుగు గ్రూపులుగా విభజించి, 150 ఈవెంట్స్‌ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజూ మూడు వెన్యూస్‌లో ఈ ఈవెంట్స్‌ నిర్వహించామని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com