ఆటో వర్క్ షాప్ నుండి 60 కిలోల హెరాయిన్ స్వాధీనం
- December 17, 2018
అబుదాబీలోని ఓ ఆటో వర్క్ షాప్ నుంచి 60 కిలోల హెరాయిన్‌ని స్వాధీనం చేసుకున్నారు. 'డెత్ స్టార్మ్' పేరుతో నిర్వహించిన ఆపరేషన్ ద్వారా ఈ హెరాయిన్‌ని పట్టుకోగలిగారు. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వర్క్ షాప్‌లోని 'యూజ్డ్ కార్స్' తాలూకు డోర్స్‌లో ఈ హెరాయిన్‌ని గుర్తించారు అధికారులు. అరెస్ట్ చేసిన అనుమానితుల్లో ఒకరు ఆసియాకి చెందిన వర్క్ షాప్ పార్టనర్ ఒకరు కాగా, మరొకరు ఇన్వెస్టర్, మిగిలిన వ్యక్తి విజిటర్. ఇన్స్టాగ్రామ్ ద్వారా అబుదాబీ పోలీస్ ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైసరెక్టరేట్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ని గ్రేట్ సెక్యూరిటీ అఛీవ్మెంట్గా అభివర్ణించారు. అరెస్ట్ చేసినవారిపై కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు కల్నల్ తాహెర్ ఘరీబ్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!