ముంబయి:ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం...ఆరుగురు మృతి
- December 17, 2018
ముంబయి: ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని ఈఎస్‌ఐసి కామ్ గార్ ఆసుపత్రిలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని మూడవ అంతస్థులో ఈ ప్రమాదం జరగగా ఇప్పటికే ఆరుగురు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. మూడో అంతస్తులో మంటలు వ్యాపించడంతో విపత్తు నిర్వహణ సిబ్బంది గోడలను బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. ఆసుపత్రిలోని రోగులు, మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. 10 అగ్ని మాపక దళాలు, 16 అంబులెన్స్ లు ఘటనా స్థలంలోనే ఉన్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







