ఐపీఎల్ ఆటగాళ్ల వేలం..
- December 18, 2018
ఐపీఎల్ వేలానికి అంతా సిధ్దమైంది. వచ్చే సీజన్ కోసం 350 మంది ఆటగాళ్ళు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించే అవకాశాలుండగా… టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్‌తో పాటు మరికొందరి ఫ్యూచర్ ఈ వేలంతో తేలిపోనుంది. ఈ వేలంలో 20 మంది విదేశీ ఆటగాళ్ళు పోటీపడుతున్నారు.
ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పులో బిజీ కానున్నాయి. ఇవాళ జైపూర్ వేదికగా ఆటగాళ్ళ వేలం జరగనుంది. 70 మందికి అవకాశం ఉండగా… 350 మంది ఆటగాళ్ళు పోటీలో ఉన్నారు. వీరిలో 20 మంది విదేశీ క్రికెటర్లు ఉండగా… మిగిలిన వారంతా భారత్ ఆటగాళ్ళే. వచ్చే ఐపీఎల్ సీజన్ త్వరగా ఆరంభం కానుండడం… కీలక విదేశీ ఆటగాళ్ళు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో వేలంలో ఫ్రాంచైజీలు వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి.
ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు సీజన్ మధ్యలోనే తిరిగి వచ్చేలా ఆదేశాలు జారీ చేశాయి. కాగా ఈ వేలంలో అందరి చూపు సిక్సర్ల ధీరుడు యువరాజ్‌సింగ్ పైనే నిలిచింది. ఒకప్పుడు 16 కోట్లు పలికిన యువీ గత కొన్నేళ్ళుగా ఫామ్ కోల్పోయాడు. మునుపటిలా అభిమానులను అలరించలేకపోతున్నాడు. దీంతో జాతీయ జట్టుకూ దూరమైన యువరాజ్ తన బేస్ ప్రైస్‌ను కోటి రూపాయలకు తగ్గించుకున్నాడు. అయితే షార్ట్ ఫార్మేట్‌లో ఈసారి యువీ సత్తా చాటుతాడని అభిమానులు ఆశిస్తున్నారు. దీంతో ఫ్రాంచైజీలు ఈ స్టార్ ప్లేయర్ కోసం ఏమాత్రం ఆసక్తి చూపిస్తాయో వేచి చూడాలి. కాగా భారత ఆటగాళ్ళలో పుజారా, ఇషాంత్ శర్మలతో పాటు గత సీజన్‌లో జాక్‌పాట్ కొట్టి అంచనాలను అందుకోలేకపోయిన పలువురు యువ ఆటగాళ్ళు కూడా వేలంలో ఉన్నారు.
మరోవైపు విదేశీ ఆటగాళ్ళలో కివీస్ స్టార్ బ్రెండన్ మెక్‌కల్లమ్ 2 కోట్ల కనీస ధరలో ఉండగా… సఫారీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ 1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో పోటీపడుతున్నాడు. గాయాల నుంచి కోలుకున్న స్టెయిన్ ప్రస్తుతం పదునైన పేస్‌తో సత్తా చాటుతున్నాడు. అలాగే లంక క్రికెటర్ మాథ్యూస్, కివీస్ ఆటగాళ్ళు గప్తిల్ , ఆండర్సన్, ఆసీస్ ప్లేయర్ షార్ట్ , ఇంగ్లాండ్ ప్లేయర్స్ హేల్స్, వోక్స్ వంటి ప్లేయర్స్ కూడా వేలంలో నిలిచారు. అయితే వన్డే ప్రపంచకప్ కారణంగా ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు సీజన్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండరన్నది తేలిపోవడంతో ఫ్రాంచైజీలు ఆతితూచి వ్యవహరించనున్నాయి. కాగా ప్రతీ ఫ్రాంచైజీ ఇప్పటికే కొందరు కీలక ఆటగాళ్ళను రిటైన్ చేసుకోగా.. తమదగ్గరున్న మిగిలిన మొత్తంతో జట్టును పూర్తి చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!