ఎన్టీఆర్ న్యూ లుక్!
- December 18, 2018టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలకు ఎంతో ప్రత్యేకం ఉంటుంది. ఆయన ఏ సినిమా తీసినా హీరోయిజాన్ని చాలా వెరైటీగా చూపిస్తుంటారు. అంతే కాదు హీరోలను కూడా చాలా ప్రత్యేకంగా చూపిస్తుంటారు. ఒకప్పుడు లావుగా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్ ని 'యమదొంగ'సినిమాతో కరెంట్ తీగలా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ని కండలు తిరిగిన ఆజానుభాహుడిగా చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ గా 'ఆర్ ఆర్ ఆర్'ప్రాజెక్ట్ బిజిలో ఉన్నారు దర్శకధీరుడు రాజమౌళి. మూవీ ఇటీవల తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా, జనవరి నుండి మరో షెడ్యూల్ జరుపుకోనుంది.
రామ్ చరణ్ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ మద్య సినిమా షూటింగ్స్ కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు పలానా సినిమాలో తమ హీరో ఎలా ఉంటాడో అన్న విషయం ముందుగానే తెలిసిపోవడంతో అభిమానుల్లో నిరుత్సాహం పెరిగిపోతుంది. ఆ కారణంతోనే ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో రాజమౌళి ఎన్నో కట్టుదిట్టాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతటి వారైనా షూటింగ్ స్పాట్ కి సెల్ ఫోన్స్ తీసుకు రావొద్దని ముందే హచ్చరించారు.
అంతే కాదు ఎలాంటి మైక్రో కెమెరాలు పనిచేయకుండా జామర్లు కూడా వాడుతున్నట్లు సమాచారం. ఆ మద్య ఎన్టీఆర్ లుక్ కి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేసింది. దీనిపై ఎన్టీఆర్ ట్రైనర్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ తన భార్య, ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫొటోలు నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఆర్ఆర్ఆర్లో యంగ్‌టైగర్ లుక్ ఇదేనంటూ నెటిజన్లు షేర్ల మీద షేర్లు చేస్తూ.. మూవీని ట్రెండింగ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్