సిటీ సెంటర్ మస్కట్ ఫ్రీ ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్
- December 18, 2018
మస్కట్: సిటీ సెంటర్ మస్కట్ షాపింగ్‌కి వెళుతున్నారా? మీకు ఎలక్ట్రిక్ కారు వుంటే, అక్కడ ఉచితంగా మీ కారుకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఆసియాల్లో ప్రముఖ షాపింగ్ మాల్, కమ్యూనిటీస్, రిటెయిల్ మరియు లీజర్ పయనీర్ అయిన మజిద్ అల్ ఫుత్తైమ్ సిటీ సెంటర్ మస్కట్ వద్ద ఈ ఛార్జింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగంతో పర్యావరణానికి హాని తప్పుతుందన్న కోణంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వాహనాల వినియోగం ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిటీ సెంటర్ మస్కట్ వద్ద ఉచిత ఛార్జింగ్ యూనిట్‌ని అందుబాటులోకి తెచ్చారు. లెవల్ వన్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడ్తుండడంతో.. సిటీ సెంటర్ మస్కట్ మాల్ (మాజిద్ అల్ ఫుత్తైమ్) తనవంతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!